![]() |
![]() |

యన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను చూసిన వారికి నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె వెర్సటాలిటీ అలాంటిది. ఆమె ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. తనదైన శైలిలో, తనదైన పర్సనాలిటీతో ముందుకు సాగుతుంటారు విద్యాబాలన్. ఆమె ఎప్పుడూ జీరో సైజ్ ఫిగర్ కోసం వెంపర్లాడలేదు. తను తనలా ఉంది కాబట్టే ఆమెను బాలీవుడ్‌లో అందరూ షీరో అని అంటారు.
పరిణీత కావచ్చు, డర్టీ పిక్చర్ కావచ్చు, కహానీ కావచ్చు, సినిమా ఏదైనా, కేరక్టర్ ఎలాంటిదైనా గ్రేస్‌తో మెప్పించారు విద్యాబాలన్. ఆమె యాక్టింగ్ పవర్ చూసి ఫిదా అయిపోతుంటారు ఆడియన్స్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు. తన బాడీ టైప్ గురించి, బాడీ పాజిటివిటీని ఎలా మెయింటెయిన్ చేశారనే విషయం గురించి డీటైల్డ్ గా చెప్పుకొచ్చారు.
విద్యాబాలన్ మాట్లాడుతూ ``ఇది ఇప్పుడు జరిగింది కాకపోయినా, ఎప్పుడూ నా మనసులోనే ఉంటుంది. డర్టీ పిక్చర్ చేసిన తర్వాత అందరూ నన్ను సెక్సీ అని అన్నారు. ఆ సినిమా కమర్షియల్‌గా అద్భుతంగా ఆడింది. ఆడియన్స్ నన్నెంతగానే మెచ్చుకున్నారు. నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఆ టైమ్‌లో నన్నందరూ ఫీమేల్ హీరో అని అన్నారు. కానీ బేసిగ్‌గా ఆ కేరక్టర్ నాది కాదు. సిల్క్ స్మితది. నేను జస్ట్ ఆ పాత్ర చేశానంతే. కంఫర్టబుల్‌గా చేయగలిగాను. సరిగ్గా అదే సమయంలో నేను సిద్ధార్థ్‌ని కలిశాను. అందరూ నన్ను సెక్సీ అనడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఆ విషయాన్ని అతను అర్థం చేసుకున్నారు. నన్ను కూడా యాక్సెప్ట్ చేయడం అలవాటుచేసుకోమన్నారు. అలా బాడీ షేమింగ్ గురించి ఏ కామెంట్ వచ్చినా విని వదిలేయడం అలవాటు చేసుకున్నాను. దాన్ని ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు. నేను దాన్ని దాటగలిగాను. నన్ను నేను అర్థం చేసుకుని ముందుకు కదిలాను`` అని అన్నారు.
![]() |
![]() |